22, నవంబర్ 2010, సోమవారం

కాకి గోల





నేనో కాకిని..
ఒకప్పుడు
ఉండేలు దెబ్బలెరుగని
పిల్లకాకిని

కొన్నాళ్లకు
ఏ దెబ్బలైనా
తప్పించుకోగల్గిన
పడుచు కాకిని

అందరి దృష్టిలో
నేనో అవివేకిని..
ఆలోచించేప్పుడు
నేనో ఏకాకిని

నలుగురిలోకి
పోతే నల్లకాకిని
నా మనసు
మాత్రం తెల్ల వాకిలి

గాలి దుమారాల్లాంటి
ఆటుపోట్లతో..
చూస్తూ విలపిస్తున్నా
నా గూటిని

జీవిత గమనంలో
గమ్యం ఎందాకని

4 కామెంట్‌లు:

  1. లోకులు కాకులు...
    అందుకే వాళ్ళ నోటితోనే అంటున్నారు....
    నువ్వు అవివేకివి ."కావు.. కావు.." మని.

    నల్లకాకివి నువ్వు "కావు... కావు".
    నీ వివేకం వాళ్లకు అర్ధం "కాదు... కాదు ".

    గాలి దుమారాలకు ఆటుపోట్లకు ఏమి "కావు.. కావు".
    గూడు చేదిరిందని విలపించకు... కష్టాలకు తలదించకు.

    మిత్రమా..
    పోయిన్దేదో పోనీ....
    అందాకా నా గుండె గుడిలో సెదతీరుమా....

    రిప్లయితొలగించండి
  2. లోకులు కాకులు...
    అందుకే వాళ్ళ నోటితోనే అంటున్నారు....
    నువ్వు అవివేకివి ."కావు.. కావు.." మని.

    నల్లకాకివి నువ్వు "కావు... కావు".
    నీ వివేకం వాళ్లకు అర్ధం "కాదు... కాదు ".

    గాలి దుమారాలకు ఆటుపోట్లకు ఏమి "కావు.. కావు".
    గూడు చేదిరిందని విలపించకు... కష్టాలకు తలదించకు.

    మిత్రమా..
    పోయిన్దేదో పోనీ....
    అందాకా నా గుండె గుడిలో సెదతీరుమా....

    రిప్లయితొలగించండి