7, సెప్టెంబర్ 2010, మంగళవారం

ని'స్వార్ధం'

వెలుగులు విరజిమ్మే సూర్యునికి లేదు స్వార్థం
వెన్నెలలు గుభాలించే చందురునికి లేదు స్వార్థం
చిరుగాలులు వీచే వృక్షాలకు లేదు స్వార్థం
ఎందుకు మరి నీకెందుకు స్వార్థం

చీకటైనా, వెన్నైలైనా మెరిసే నక్షత్రానికి లేదు స్వార్థం
వర్షమైనా వేడిమైనా పుడమికి లేదు స్వార్థం
చిరకాలం ఉండే ఈ జగతికి లేదు స్వార్థం
మున్నాళ్ల ముచ్చటగా ఉండే నీకే ఎందుకు స్వార్థం

ఏ స్వార్థం లేకుండా ఎన్నో చేశారు మహాత్ములు
ఏ స్వార్థం లేకుండా ఎన్నో నిర్మించారు మన నిర్మాతలు
నిజాయితీ ఉంటే చాలు, నిస్వార్థం ఉంటే మేలు
ఎన్ని పనులైనా చేయవచ్చు, ఎవరినైనా ఎదురించవచ్చు

లంచం పుచ్చుకోకు మరి అది నీ కొంప ముంచేను
బాంచెన్ అని తలవంచకు అది నీ తల దించేను
ఏ స్వార్థం లేకుంటే ఎవరూ నిన్నాపలేరు
నిస్వార్థంగా ఉంటే నీ విజయాన్ని ఆపలేరెవ్వరు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి