10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

నాయక - వి'నాయక '

వినాయకుని ఉండ్రాళ్ళ బొజ్జకు పోటీ

ఉందిగా మన నాయకుల స్కాముల్ బొజ్జ సరిసాటి

కాలుశ్య రక్కసినణచేందుకు వినాయకుడు..

చిన్ని మూషిక వాహన మెక్కుతుంటే

మన నాయకులకు మాత్రం

భారి సుమోలు, క్వాలిస్ లు.

గణేశుడు మట్టి గణపతి స్థాయి నుండి

ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ గా మారినట్లు

మన నాయకులు సైతం

ప్రజాసేవ, మానవత్వం స్థాయిల నుండి

రౌడీయిజం, లంచగొండితనం స్థాయికి ఎదిగారు.

ఆది దేవుడికి ఎడాదికోమారే ఊరేగింపు

మన నాయకులకు మాత్రం

ప్రతిరోజూ ఏదో మూల ఊరేగింపు.

వక్రతుండినికి ప్రతి ఏటా నిమజ్జనం,

మరి మన నేతలకు మాత్రం..

ఐదేళ్లకోకసారే నిమజ్జనం.

వినాయకుణ్ణి నిమజ్జనం చేస్తే,

ఖచిత్తంగా మునుగుతాడు,

కాని మన నాయకులు మాత్రం

ఎన్నికల నిమజ్జనంలో మునగవచ్చు,

లేదా మని, మద్యం పంచి..

రిగ్గింగ్ లు చేసి తేలనూవచ్చు.

3 కామెంట్‌లు: