18, సెప్టెంబర్ 2010, శనివారం

మర్యాద రామన్న - మిస్టేక్

సునీల్ హీరోగా సక్సెస్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మర్యాద రామన్న చూసే ఉంటారు. డైరెక్టర్ రాజమౌళి చిత్రాన్ని ఆద్యంతం వినోదభరితంగా మలిచారు..స్టూడెంట్ నెం1 చిత్రం నుంచి మొన్నటి మగధీర వరకు సక్సెస్ చిత్రాలను అందిచిన రాజమౌళి కామెడీ స్టార్ సునీల్ ను పెట్టి సక్సెస్ సాధించారు.. రివ్యూలన్నీ ఇప్పుడెందుకంటారా.. ప్రతీ సీన్ లోనూ పర్ ఫెక్షన్ చేసే రాజమౌళి ర్యాదరామన్న చిత్రంలో చిన్న పొరపాటు దొర్లింది.. కాస్త గమనిస్తే సీన్ ఇట్టే తెలిసిపోతుంది..
సినిమా లోని సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది.. సినిమాలోని కామెడీ సీన్ లన్నింటిలో బాగా నవ్వించిన సీన్ ఇది.. రైల్వే స్టేషన్ లో కిటికీలోంచే కొబ్బరి బొండం కొన్న సునీల్ దాన్ని తేలేక ఇబ్బంది పడి అందరినీ నవ్వించాడు.. ఇప్పుడీ విషయమంతా ఎందుకంటారా.. అక్కడే ఉంది అసలు విషయం.. సునీల్ కొబ్బరిబొండాం కొనేటప్పుడు గమనించండి.. ట్రైన్ బయటనుండి అమ్మేవ్యక్తి బోండం ఇచ్చేటప్పుడు సునీల్ సీటుకు రెండు సీట్ల తర్వాత ట్రైన్ డోర్ ఉంటుంది.. ట్రైన్ మూవ్ అయ్యా కాసేపటికి సునీల్ బోండాన్ని ట్రైన్ లోకి తెచ్చేందుకు నానా ఇబ్బందులు పడ్డాక విసుగొచ్చి విసిరేస్తే అది కాస్తా బయట గోడను తాకి తిరిగి ట్రైన్ లోకే వచ్చేస్తుంది.. అలా వచ్చేప్పుడు మాత్రం సునీల్, సలోని కూర్చున్న సీటు డోర్ పక్కనే ఉంటుంది.. ఇది ఎలా సాధ్యం? ఒకవేళ ధ్యలో సీటు మారి ఉంటారనుకుంటే అప్పటివరకు బోండం సునీల్ చేతిలోనే ఉంది మాత్రాన సీటు మారే అవకాశం లేదు.. గమనించండి మరి..















7 కామెంట్‌లు:

  1. వీడియో పెట్టాల్సింది మస్టారూ, ఫొటోలు పెట్టారు గానీ గమనించడం కుదరలేదు.
    can u pls remove word verification?

    రిప్లయితొలగించండి
  2. http://www.youtube.com/watch?v=O5LK4UR8Cqo

    youtube lo dorkindi mastaru.

    అవర్ హాస్పిటాలిటి చూసాను యుటూబ్ లో, సినిమా 90%, కాన్సెప్ట్ 100% మక్కికి మక్కి. 1920స్ లో వచ్చిందనుకుంటా, అప్పటి సైకిల్, ట్రైన్ వింతగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  3. అంతో కాదు సునీల్ కింద పడ్డాక లేచి వేరే భోగీ శుబ్బరంగా ఎక్కేస్తాడు, ముందుకు వెళ్లిన తన భోగీ కాకుండా.

    రిప్లయితొలగించండి
  4. కరెక్టే నండి భలే విషయం కనిపెట్టారు. గుడ్ ...మీకు ఒక విషయం తెలుసా. ఈ సీన్ మొత్తంలో చిన్న పార్ట్ కూడా ట్రైన్ లో తీయలేదంతా సలోని ఇంటర్వ్యూ లో చెప్పింది అప్పట్లో. నాకైతే వొందెర్ అనిపించింది

    రిప్లయితొలగించండి
  5. నేనూ గమనించాను ఈ మిస్టేక్ ని, కాని సినిమాలలొ చిన్న చిన్న మిస్టేక్స్ ఉండడం సహజం.
    http://coolraki.blogspot.com

    రిప్లయితొలగించండి
  6. అందుకే మాస్టారు ఇప్పుడు పెట్టాను గమనించండి..

    * * * * * * * * * * * * * * * * * * * *
    1923 లో వచ్చిన అవర్ హాస్పిటాలిటి కి కాపీగా అనిపించినా
    తమిళ సినిమాలను మక్కికి మక్కి రీమేక్ చేసే కంటే..
    ఎప్పటిదో మూకీ సినిమాను ఇప్పటికీ వినోదం పంచేలా తీయటం సాహసమే కదా..
    ఆ విషయం లో రాజమౌళి గారిని మెచ్చుకోవాలి..
    అయినా ఇలాంటి చిన్న చిన్న తప్పులు సహజం..
    ఏదో మీరు చూస్తారని చెప్పానంతే..
    అది పెడదామా .. వద్దా.. అని ఓ 10 రోజులు అలోచించి మరీ..
    * * * * * * * * * * * * * * * * * * * *

    రిప్లయితొలగించండి