16, సెప్టెంబర్ 2010, గురువారం

జోగినీ, కారాదు నీవో భోగిని

మన రాష్ట్రంలో ఇప్పటికీ పలు ప్రాంతాల్లో మూడవిశ్వశాలతో స్త్రీని ఒక భోగ వస్తువుగానే చూస్తున్నారు.. అలా మూడ విశ్వాసాలకు బలవుతున్న "జోగినీ" జీవితపు ముల్లభాట, నా-మాట .


దేవదాసి, మాతంగి, జోగిని
నిన్నే పేరుతొ పిలిచినా
నీవి లోకానికి
అవుతున్నావు భోగిని.

ఆర్యుల సంస్కృతికి
అర్పనమైన దేవదాసి,
ద్రావిడ సంస్కృతికి
దర్పనమైన జోగిని.

ప్రకృతి దేవతల పేరిట
దళిత స్త్రీల జీవితాలు అర్పణం,
భూస్వామ్య ధనిక వర్గాల ద్వారా
స్త్రీల మాన ప్రాణాల సమర్పణం.

జన సందోహంలో వస్తుంది పూనకం,
పూనకం కాదది భూటకం,
సాంప్రదాయపు ముసుకులో
భుస్వామ్యపు బడా నాటకం.

జోగినిగా జోగుపత్తం
చేసేడు పోతురాజు,
భోగినిగా మైలపట్టం
చేసేడు ఉరికి రాజు.

పైకి దేవత సేవిక,
లోకి విటుల కామిక,
కాదిది కేవలం వ్యభిచారం,
స్త్రీపై సాంప్రదాయపు అత్యాచారం.

అందం సత్తువ ఉన్ననాళ్ళు
ఆమె ఉరికి కామిక,
అవి సన్నగిల్లాక
ఎవరికియా ఏమి కాని అనామిక.

పశువు కంటే
హీనమాయే స్త్రీ బ్రతుకు,
ఒక్క వేటుతో దున్నపోతు ప్రాణం బలి,
మూఢ సాంప్రదాయపు కాటుతో జోగిని మానం బలి.

జోగినీల పిల్లల జీవితాలు,
తండ్రెవరో తెలియని భావితలు,
ఆడ పిల్లయితే వారు వూరికి అర్పణం,
అందుకే వడ్ల గింజలతో ప్రాణాల సమర్పణం.

కావలి భూస్వామికి పర స్త్రీతో రతి,
దానికి జోగినీల జీవితం హారతి,
వీరికుండదు సరైన బృతి,
అవుతుంది వీరి బ్రతుకు కాలని చితి.

శవాల ముందు చేసే నృత్యం,
స్త్రీకి ఇచ్చే విలువలకు నగ్న సత్యం,
వృద్ధ ప్రాయంలో వీరికి భాధలు నిత్యం,
వీరి జీవితం వెలుగే లేని నిషి రాత్రులవడం తద్యం. "

3 కామెంట్‌లు: