మేకవన్నె పులులెక్కడో కాదు..
ఇక్కడే మన చుట్టూ ఉన్నాయ్
మతం ముసుగులో
మారన హోమం చేస్తూ
రాజకీయం ముసుగులో
రౌడీయిజం చేస్తూ
మేకవన్నె పులులెక్కడో కాదు..
ఇక్కడే మన చుట్టూ ఉన్నాయ్
మనోభావాల ముసుగులో
మతోన్మాదం నేర్పుతూ
కులాల ముసుగులో
కుమ్ములాటలు చేస్తూ
మేకవన్నె పులులెక్కడో కాదు..
ఇక్కడే మన చుట్టూ ఉన్నాయ్
ప్రేమికుల ముసుగులో
యాసిడ్ దాడులు చేస్తూ
బంధువుల ముసుగులో
కిడ్నాప్ మర్డర్లు చేస్తూ
మేకవన్నె పులులెక్కడో కాదు..
ఇక్కడే మన చుట్టూ ఉన్నాయ్
బాబాల ముసుగులో
భూ కబ్జాలు చేస్తూ
కాషాయం ముసుగులో
కామ క్రీడలు సల్పుతూ
మేకవన్నె పులులెక్కడో కాదు..
ఇక్కడే మన చుట్టూ ఉన్నాయ్
కార్పోరెట్ విద్య ముసుగులో..
జేబులు ఖాళీ చేస్తూ
కాస్ట్ లీ వైద్యం ముసుగులో..
మద్యతరగతి బతుకులు పీల్చేస్తూ
మేకవన్నె పులులెక్కడో కాదు..
ఇక్కడే మన చుట్టూ ఉన్నాయ్
మూఢ విశ్వాసాల ముసుగులో
ఘోర హత్యలు చేస్తూ
లాంఛనాల ముసుగులో
వరకట్నం లాగెస్తూ
మేకవన్నె పులులెక్కడో కాదు..
ఇక్కడే మన చుట్టూ ఉన్నాయ్
మంత్రిత్వం ముసుగులో
మాఫియాలు నడిపిస్తూ
ఓట్ల ప్రచారం ముసుగులో
నోట్లు పంచుతూ
మేకవన్నె పులులెక్కడో కాదు..
ఇక్కడే మన చుట్టూ ఉన్నాయ్
లైసెన్స్ షాపుల ముసుగులో
బెల్టు షాపులు నడిపిస్తూ
సినీ గ్లామర్ ముసుగులో
బట్టలన్ని విప్పి చూపిస్తూ
మేకవన్నె పులులెక్కడో కాదు..
ఇక్కడే మన చుట్టూ ఉన్నాయ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి