30, ఆగస్టు 2010, సోమవారం

అ.ఆ. (అనుమానపు ఆవహం)

కకావికలమైన
మనస్సులో కార్చిచ్చు
రగిలించేందుకు వస్తోంది..
అనుమానపు ఆవహం

ఎంతటోడైనా
ఎంత ఉన్నోడైనా
ఎందరున్నోడైనా
అ.ఆ కు లోకువే..!

కొండంత ప్రేమ ఉన్నా
అనురాగం అఖిలాండం ఉన్నా
అణువంత అనుమానానికి
ఆసాంతం లోకువే

మనసు మందిరంలో కొలువైన
ప్రేమానురాగాలను అణగదొక్కి
అగ్ర సింహాసన మెక్కుతుందీ..
అనుమానపు ఆవహం

బంధు ప్రీతి లేదు
స్నేహితుడన్న చొరవ లేదు
వావి వరసలు పట్టించు కోదు
స్వ, పర స్వార్ధం అసలు లేనిదే..
అనుమానపు ఆవహం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి