30, ఆగస్టు 2010, సోమవారం

పార్టీల పరంపర

పార్టీ, పార్టీ, పార్టీ
ఇదేదో బర్త్ డే పార్టీయో,
మరేదో వెడ్డింగ్ డే పార్టీయో
ననుకున్నా కానీ..

ఇది నవభారతంలోని
నయా రాజకీయ పార్టీ
ఈ పార్టీకి అవసరాలే కానీ..
ఆశయాలు లేవు

స్వార్దమే కానీ నిస్వార్ధం తెలియదు,
లంచమే కానీ మంచాన్నది కానరాదు,
అవినీతే కానీ నీతన్నది అగుపించాడు,
తమ త్రోవే కానీ ప్రజాసేవ జ్ఞప్తి రాదు.

అక్రమార్కులే అగ్రగణ్యులు,
అందినంత దోచుకుందురు,
అందకుంటే కాచుకుందురు
మలి ఎన్నికలకై మరి వేచివుందురు

కాళ్ళ బొల్లి మాటలతో,
బుల్లి బుల్లి మీటింగులతో,
గల్లి గల్లి తిరుగుతూ
మళ్ళి మళ్ళి ఒట్లడిగేరు

పదవి కొరకు పరువు విడిచి,
వంగి వంగి దండమేట్టి
వీడి వీడి బిక్షమెత్తి
నోట్లు పంచి ఒట్లడిగేరు

కులం పేరుతో ఒక పార్టీ
మతం పేరుతో మరో పార్టీ
పదవి రాకుంటే కొత్త పార్టీ
ప్రజాసేవే లక్ష్యమంటూ మరో పార్టీ

అధికార పార్టీలో
పదవుల సెలయేరులో
బడా నాయకుల అధిక్యపు హోరు
నయా పార్టీల ప్రారంభపు జోరు

పాత పార్టీల్లో చీలికలు
కొత్త పార్టీలకు ఆరంభాలు
జన సంఖ్యతో పాటు
పార్టీల అంకె పెరుగుతోంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి