24, ఏప్రిల్ 2010, శనివారం

"నానీలు"

దగా మాట చిన్నదే
మూల్యం పెద్దది
కలియుగంలో
కామనైపోయింది

మంత్రివర్యుల
ఆంగ్ల వాగ్ధాటి
తెలుగు భాషా
దినోత్సవ దుర్గతి

భరించే వాడె
భర్తన్నారు
బ్రతిమాలాడ్సిన
వాడు భర్తేనంటాను

కాలం సైతం
గాలం వేసింది
సునామి వలలో
నర చేపల విలవిల

వివాహం
మూడు ముళ్ళే
విడాకులు
ముగ్గురు పిల్లలు

వందేమాతరం
అంటే
ఏ.ఆర్.రెహమాన్
కంపోస్ చేసిన సాంగ్


కథ ఒక్కటే
కథనాలెన్నో
వివాదాల్లో
మగధీరుదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి