మనసుని కదిలించి
మధురానుభూతులు పంచే
కవిత రాసీది కలం.
మనిషిని భయపెట్టి
భీతిలేట్లు చేసే
హర్రర్ కథ రాసేది కలమే!
నరనరాలు ఉప్పెంగి,
ఉరకలు వేసే
విప్లవాలను రాసేది కలమే!
ప్రకృతి అందాలకు
పరవశమై వర్ణనలు
రాసేది కలమే!
కానీ..... రాసే
కలం, పాళీ, సిరానే వేరు.
రాసే రాతల్లో తేడాలున్నట్లే ,
సిరా రంగుల్లోనూ తేడాలుంటాయి,
ఆ సిరా మనసు ఆలోచనలనే
రంగులు పులుముకుంటుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి