5, సెప్టెంబర్ 2010, ఆదివారం

తెలుగు లెస్స- లెస్సా ..?

నాటి తెలుగు భాషా మాధుర్యం
నలు దిక్కులా విస్తరించే
శ్రవణానందకరంగా
నేడు తెలుగు భాషన్నా
తెలుగు మాటన్నా
తెలివితక్కువతనంగా చూస్తుందీ..
లోకం వెకిలితనంగా

దేశ భాషలందు తెలుగు లెస్స
అన్న ఆంధ్రబోజుని మాట
ఆంధ్ర రాష్ట్రమందు తెలుగు లెస్స
అంటున్న ఆంద్ర పాలకుల మాట

ఆంధ్రరాష్ట్ర అవతరణ దినం నాడైనా..
వినలేమా పాలకుల నోట తెలుగు మాట
మన తెలుగులో లేదా మాధుర్యపు తేట
మరెందుకు పరాయి భాషకు బాట

ఎందుకంత వ్యామోహం
మనలో ఎందుకింత వ్యాకులత
తెలుగు భాషకే తెగులు
పుట్టిస్తున్న పరభాషా వ్యామోహం


అల్లసాని వారి పద అల్లిక
నన్నయ్య నుడికారపు జల్లులు
తిక్కన మాటల తియ్యందనాలు
శ్రీనాధ కవిసార్వభౌముని చమత్కార విరుపులు
తిమ్మన కవి నోట విరిసిన..
యింతి వొంటి విరుపులు

గురజాడ వారి గుంభనపు మాటలు
విశ్వనాథ వారి కిన్నెర సొగసులు
కృష్ణశాస్త్రి గారి భావాల మెత్తదనాలు
జాషువా అభ్యుదయ భావాలు

చూశారా చవి చూశారా
ఇకనైనా పరభాషా వ్యామోహం మానుకు
తెలుగు భాషాభ్యున్నతికి
మీ వంతు సహకారం అందిస్తూ..
తెలుగు భాష కన్నీరు తుడువు

2 కామెంట్‌లు:

  1. అవును తెలుగు భాషలోని తియ్యదనం ఎందులో ఉంది!!!!

    రిప్లయితొలగించండి
  2. మీ పిచ్చి గానీ
    ఈ రోజుల్లో తెలుగు ఎవడికి కావాలి
    ఎందుకు కావాలి.
    ఆనాడు
    మద్రాస్ నుంచి ఆంద్ర రాష్ట్రం విడిపోయేందుకు
    తెలుగు తల్లిని సృష్టించారు
    ఆ తర్వాత తెలంగాణాను కబళిన్చేందుకు
    తెలుగు సెంటిమెంటును రెచ్చగొట్టారు.
    అరవై సంవత్సరాలైనా తెలుగు ను అధికార భాషగా అమలు చేయని
    ప్రభుత్వం తీరు చూసినా మీరు గ్రహించలేదా ?
    ఇప్పుడు ఇంకా తెలుగెందుకు .,.. తెలుగు ఎవరికీ?
    - యాదగిరి

    రిప్లయితొలగించండి